: నిరుద్యోగులకు శుభవార్త... ఏపీలో పరుగు పరీక్ష లేకుండానే పోలీసు నియామకాలు!


"గతంలో మావోల సంఖ్య ఎక్కువగా ఉన్నందున పోలీసు నియామకాల్లో దేహదారుఢ్యానికి ప్రాధాన్యం ఇచ్చాం. ఇప్పుడు సైబర్ నేరాలు పెరిగినందున శరీర శక్తికన్నా తెలివితేటలు, చురుకుదనం ముఖ్యం కాబట్టి పోలీసు నియామకాల నిబంధనలు మార్చాలి" అని ఏపీ పోలీసు శాఖ చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినట్టు సమాచారం. దీని ప్రకారం తొలుత పరుగు పందెం, ఆపై దేహదారుఢ్య పరీక్షల తరువాత రాతపరీక్ష జరిపే పోలీసు శాఖ, ఇకపై తొలుత రాతపరీక్ష, ఆపై దేహదారుఢ్య పరీక్షలు జరుగుతాయి. 5 కి.మీ. పరుగు పరీక్ష పూర్తిగా తొలగుతుంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా నియామకాల్లో మార్పులు చేయాలని భావించిన డీజీపీ జేవీ రాముడు, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులతో చర్చించారు. ఆపై ఐదు కిలోమీటర్ల పరుగు పూర్తిగా తీసేసి, దేహదారుఢ్య పరీక్షల్లో సడలింపు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ మేరకు నెలన్నర క్రితమే ప్రభుత్వ నిర్ణయం కోసం ప్రతిపాదనలు పంపగా, బాబు సర్కారు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఏపీలో త్వరలో జరిగే పోలీసు రిక్రూట్‌ మెంటులో ఈ మార్పులు అమలవుతాయని సమాచారం.

  • Loading...

More Telugu News