: అవును, టీఆర్ఎస్ నన్ను ఆహ్వానించింది!: డీఎస్


తనను టీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఆ పార్టీ నేతలు గౌరవంగా ఆహ్వానించారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ స్పష్టం చేశారు. తాను మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతకాలమూ తనను అభిమానిస్తూ, వెన్నంటి నిలిచిన అభిమానులతో, పార్టీ కార్యకర్తలతో ఈ విషయమై చర్చించాల్సి వుందని వివరించారు. ఆ తరువాతనే తాను నిర్ణయం తీసుకుంటానని డీఎస్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని, అయితే, ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు లేదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News