: రాజమండ్రిలో భారీ వర్షం... 250 ఇళ్లలో కాలిపోయిన టీవీలు, ఫ్రిజ్ లు, ఫ్యానులు
రాజమండ్రి నగరం గత రాత్రి ఈదురుగాలులు, భారీ వర్షంతో అతలాకుతలమైంది. కోటిలింగాల పేటలో హైటెన్షన్ వైర్లు తెగి సాధారణ కరెంట్ లైన్లపై పడడంతో సుమారు 250 ఇళ్లలో ఆన్ చేసివున్న గృహోపకరణాలన్నీ ఒక్క క్షణంలో కాలిపోయాయి. హై ఓల్టేజీ కారణంగా టీవీలు, ఫ్రిజ్ లు, ఫ్యాన్లు తదితర ఎలక్ట్రానిక్ ఉపకరణాలన్నీ పొగలొచ్చి పాడైపోయాయని ప్రజలు వాపోయారు. పుష్కర పనుల కారణంగా విద్యుత్ స్తంభాలను ఇష్టానుసారం మారుస్తున్నారని, దానివల్లే హై ఓల్టేజీ వచ్చిందని ప్రజలు ఆరోపించారు. పాడైపోయిన గృహోపకరణాలను రోడ్లపైకి తెచ్చి పడేసి నిరసనలు తెలిపారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.