: మంచు కొండల మధ్య క్లిష్టమైన అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన హోం మంత్రి రాజ్ నాథ్


భువిపై ఏర్పడే అద్భుతంగా, పరమశివుడు స్వయంగా మంచు రూపంలో అవతరించి భక్తులకు దర్శనమిస్తాడని హిందువులు నమ్మి, వ్యయప్రయాసలకు ఓర్చి చేసే అమర్ నాథ్ తీర్థయాత్ర ఈ ఉదయం జమ్మూలో ప్రారంభమైంది. తొలి విడతలో 1100 మంది భక్తులు బల్తాల్ మార్గం ద్వారా ఈ యాత్రకు బయలుదేరారు. ఈ బృందంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ కూడా ఉన్నారు. స్వయంగా హోం మంత్రే యాత్రకు బయలుదేరడంతో ఈ మార్గంలో అదనంగా సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించారు. తొలి బృందం యాత్రను శ్రీనగర్ ప్రభుత్వ అధికారులు జెండా వూపి ప్రారంభించారు.

  • Loading...

More Telugu News