: 'ఆట మొదలైంది' అంటున్న రేవంత్ గణం!


తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డికి బెయిలు లభించడంతో ఆయన అభిమానులు ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి ఆయనకు స్వాగతం పలుకుతూ వివిధ ప్రాంతాల్లో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిల్లో కొన్ని అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అందులో ఒకటే ఈ 'ఆట మొదలైంది' ప్లెక్సీ. ఎన్టీఆర్, చంద్రబాబుల చిత్రాలతో పాటు ఓ పెద్దపులి బొమ్మ, రేవంత్ చిత్రం ఉన్న ఈప్లెక్సీపై 'ఆట మొదలైంది' అని రాశారు. హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఈ ప్లెక్సీ కనిపిస్తోంది. స్వతహాగా అధికార తెలంగాణను నిలదీస్తూ, తనదైన శైలిలో విరుచుకుపడే తమ నేత ఇకపై సమస్యలను పరిష్కరించే దిశగా మరింతగా స్పందిస్తారని, తనకు జరిగిన అన్యాయానికి ఎదురొడ్డి నిలిచి పోరాడతారని చెప్పేందుకే ఈ ప్లెక్సీలు ముద్రించినట్టు రేవంత్ అభిమానులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News