: హైదరాబాద్ మా తాత జాగీరే, నోరు అదుపులో పెట్టుకోండి: ఏపీ నేతలకు టీ-మంత్రి హెచ్చరిక


హైదరాబాద్ ఏమైనా కేసీఆర్ తాత జాగీరా? అని ఏపీ మంత్రులు వేసిన ప్రశ్నపై అంతే స్థాయిలో తెలంగాణ రోడ్లు, భవనాలశాఖ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ ముమ్మాటికీ కేసీఆర్‌ తాతల జాగీరేనని, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి తాతలు, తండ్రుల జాగీరని అన్నారు. ఓటుకు నోటు కేసును తప్పుదారి పట్టించేందుకు సెక్షన్-8 పేరిట అలజడి సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఏపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. హైదరాబాదుతో పాటు తెలంగాణలో ఎక్కడ ఏ ప్రాంతం వారున్నా అందరినీ సమానంగా, గౌరవంగా చూస్తున్నామని మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రం గురించి మాట్లాడటాన్ని ఏపీ మంత్రులు ఇకనైనా మానుకోవాలని సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News