: నేటి నుంచి గోదారమ్మకు అఖండ హారతి


గోదావరి నది... ఎక్కడో మహారాష్ట్రలోని నాసిక్ లో పుట్టి, తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాల భూములను సస్యశ్యామలం చేసిన నదీమ తల్లి. తన ఒడ్డున ఎన్నో దేవాలయాలను కొలువు దీర్చుకున్న ఆ తల్లికి నిత్య పూజలు మాత్రం లేవు. ఈ లోటును తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఉత్తరాదిన కాశీలో గంగానదికి ఇచ్చే హారతి పూజలా, గోదావరి నదికి నిత్యమూ అఖండ హారతిని ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి నేటి సాయంత్రం ముహూర్తం నిర్ణయించింది. నేటి నుంచి రాజమండ్రి గోదావరి ఘాట్లలో నిత్యమూ పూజలు నిర్వహించి హారతిని ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ పూజా కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.

  • Loading...

More Telugu News