: 28 ఏళ్ల తరువాత చిలీకి దక్కిన అవకాశం!
ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లో మినీ ప్రపంచ వరల్డ్ కప్ గా తెచ్చుకున్న కోపా అమెరికా కప్ లో 28 సంవత్సరాల తరువాత చిలీ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిన్న జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో పెరూపై 2-1తేడాతో చిలీ నెగ్గింది. 1987 తరువాత చిలీ జట్టు టైటిల్ పోరులో నిలవడం ఇదే మొదటిసారి. రెండో అర్ధభాగంలో చిలీ ఎటాకింగ్ ఆటతో దూసుకెళ్లింది. ఆ దేశ ఆటగాడు ఎడ్యురాడో వెర్గాస్ ఆట 42, 64వ నిమిషాల్లో రెండు గోల్స్ చేశాడు. పెరూ ఆటగాడు గ్యారీ మెడెల్ 60వ నిమిషంలో గోల్ సాధించాడు. స్కోరును సమం చేసేందుకు పెరూ శతవిధాలుగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది.