: లోకేశ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన టీఆర్ఎస్ యువ ఎంపీ


సీఎం చంద్రబాబుకు ఎదురుపడలేకనే గవర్నర్ విందుకు కేసీఆర్ డుమ్మా కొట్టారన్న నారా లోకేశ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ యువ ఎంపీ బాల్క సుమన్ ఘాటుగా స్పందించారు. లోకేశ్ ను ట్విట్టర్ బాబు అని పేర్కొంటూ, సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి లోకేశ్ కు లేదని అన్నారు. ఆడియో టేపులో గొంతు చంద్రబాబుది కాదని చెప్పగలవా? అంటూ సవాల్ విసిరారు. ఓటుకు నోటు వ్యవహారంలో దొరికిపోయిన రేవంత్ ను పార్టీ నుంచి తొలగించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. అసలు, సీఎం కేసీఆర్ కు ఎదురుపడే ధైర్యం లేకనే చంద్రబాబు హకీంపేట్ ఎయిర్ పోర్టు వద్దకు రాలేదని ఎద్దేవా చేశారు. లోకేశ్ రాజకీయ అజ్ఞాని అని విమర్శించారు.

  • Loading...

More Telugu News