: అసెంబ్లీలో మైక్ విరిచేసిన బీజేపీ ఎమ్మెల్యే
ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల చివరి రోజు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీలో ప్రసంగం మధ్యలో మైక్ కట్ చేసినందుకు నిరసనగా బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ మైక్ ను ఏకంగా విరిచేశారు. కేవలం ప్రతిపక్ష నేతలు మాట్లాడేటప్పుడే మైక్ కట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మైక్ విరిచేయడాన్ని తప్పుపట్టిన ఆప్ సభ్యులు, సభకు ఓపీ శర్మ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ ప్రారంభమైన తొలి రోజుల్లో నిరసనలతో సభకు ఆటంకం కలిగిస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ సాయంతో సభ బయటకు పంపిన సంగతి తెలిసిందే.