: స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
సామాన్యుడికి స్వల్ప ఊరట! పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ లీటర్ పై 31 పైసలు, డీజిల్ లీటర్ పై 71 పైసలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయించాయి. తగ్గిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడిని మరింత కష్టాల్లోకి నెడుతుండడం తెలిసిందే. ఇంధనం ధరలు పెంచినప్పుడు పెద్ద మొత్తంలో పెంచే చమురు సంస్థలు తగ్గించే విషయంలో ఉదారత ప్రదర్శించడం లేదన్నది వినియోగదారుడి అభిప్రాయం!