: కాంగ్రెస్ పై డీఎస్ అసంతృప్తి...సోనియా గాంధీకి లేఖ
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ (డీఎస్) పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పై ఆయన లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా ఎమ్మెల్సీ టికెట్ మరొకరికి ఇవ్వడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తుండగా, ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నారంటూ వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.