: వైసీపీ ఎంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ చార్జ్ షీట్


వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ కొత్తపల్లి గీతపై సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆమెతో పాటు మరో ముగ్గురిపైనా చార్జ్ షీట్ దాఖలైంది. నకిలీ పత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.42.79 కోట్ల రుణం తీసుకుని మోసం చేశారన్న అభియోగంతో నేరపూరిత కుట్ర, ఐపీసీ 420, 120బి, ఇతర సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదైంది. ఈ క్రమంలో కొత్తపల్లి గీతపై విచారణ జరిపిన సీబీఐ ఈ రోజు చార్జ్ షీట్ వేసింది. గతంలో ఓ ప్రైవేటు కంపెనీకి గీత ఎండీగా పనిచేశారు. ఆ సమయంలోనే ఇలా బ్యాంకును మోసం చేసినట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆమె అరెస్టు అనివార్యం కావచ్చని సమాచారం.

  • Loading...

More Telugu News