: ధోనీ పాత్ర కోసం ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డ బాలీవుడ్ నటుడు
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింద్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న 'ఎంఎస్ ధోనీ-ఏన్ అన్ టోల్డ్ స్టోరీ' పేరిట రూపొందనున్న సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ జూలై నుంచి ప్రారంభం కానుంది. కాగా, ధోనీ ట్రేడ్ మార్క్ హెలికాప్టర్ షాట్ ఆడే క్రమంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పక్కటెముకలకు గాయాలైనట్టు సమాచారం. కాగా, ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.