: కట్నం కోసం నా భర్త వేధిస్తున్నాడు: ఐపీఎస్ భార్య


స్థాయికి తగ్గ కట్నం ఇవ్వలేదని వివాహం జరిగిన నాటి నుంచి తన భర్త వేధిస్తున్నాడని ఐపీఎస్ అధికారి భార్య మెయిల్ ద్వారా పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. సాక్షాత్తూ డిప్యూటీ కమిషనర్ పై ఫిర్యాదు రావడంతో కమిషనర్ దానిని డీజీపీ కార్యాలయానికి ఫార్వర్డ్ చేశారు. చెన్నైలో ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న సదరు ఐపీఎస్, వివాహం జరిగిన నాటి నుంచి కట్నం కోసం తనను వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి వేధింపులు తాళలేక, తాను ఇల్లు వదిలి వచ్చేశానని ఆమె తెలిపారు. తన తొమ్మిదేళ్ల కుమారుడ్ని పోషించుకునేందుకు కళాశాలలో చిన్నపాటి ఉద్యోగం చేయాల్సి వస్తోందని ఆమె వెల్లడించారు.

  • Loading...

More Telugu News