: ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సాయిబాబాకు తాత్కాలిక బెయిల్
ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జీఎన్.సాయిబాబాకు తాత్కాలిక ఊరట లభించింది. మూడు నెలల పాటు ఆయనకు ముంబయి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో గతేడాది మేలో ఢిల్లీలో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని మావోయిస్టు ప్రభావిత గడ్చిరోలి జిల్లా నుంచి పరారైన మావోయిస్టు బృందంతో సాయిబాబాకు లింకులు ఉన్నాయని పోలీసులు ఆరోపించారు. కానీ ఆ ఆరోపణలను అప్పట్లో సదరు ప్రొఫెసర్ ఖండించారు. కానీ పోలీసులు జరిపిన తనిఖీల్లో ఆయన కంప్యూటర్ లో దొరికిన ఆధారాలతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు.