: హైదరాబాదును యూటీ చేయాలని ఏపీ మంత్రులంటుంటే... ఇక్కడి టీటీడీపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు?: టీఆర్ఎస్
తెలంగాణ టీడీపీ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మండిపడ్డారు. హైదరాబాదును యూటీ చేయాలంటూ ఏపీ మంత్రులు డిమాండ్ చేస్తుంటే... టీటీడీపీ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణ ప్రజల అబ్బ సొత్తు, తాతల సొత్తు అని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడం వల్లనే... ఫోన్ ట్యాపింగ్, ఫోన్ ట్యాపింగ్ అంటూ కేసును తప్పుదోవ పట్టించే యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలు ఉంటే వాటిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు.