: కేజ్రీవాల్ కు ప్రధాని అపాయింట్ మెంట్ నిరాకరణ


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ లభించలేదు. ప్రధాని బిజీగా ఉండడంతో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతకు నిరాశ తప్పలేదు. ప్రధాని అపాయింట్ మెంట్ కోరుతూ కేజ్రీ పది రోజుల క్రితమే లేఖ రాశారు. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ వ్యవహారం, ఇతర ముఖ్యమైన అంశాలను చర్చించేందుకు ఆయన ప్రధానిని కలవాలని భావించారు. అయితే, ప్రధాని మోదీ తాను ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నానని, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని గానీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను గానీ కలవాలని ఢిల్లీ సీఎంకు సూచించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ హోం మంత్రి రాజ్ నాథ్ ను కలిసి, చర్చించారు. అయితే, రాజ్ నాథ్ తో భేటీ సంతృప్తికరంగా జరగలేదని 'ఆప్' వర్గాలు పేర్కొన్నాయి.

  • Loading...

More Telugu News