: ఔట్ లుక్ పత్రికకు లీగల్ నోటీసులు పంపిన స్మిత సబర్వాల్
'ఔట్ లుక్' పత్రికకు తెలంగాణ సీఎంవో అదనపు కార్యదర్శి స్మిత సబర్వాల్ లీగల్ నోటీసులు పంపారు. తనను కించపరిచేలా కథనాలు ప్రచురించారంటూ, దానిపై వివరణ ఇవ్వాలంటూ ఐదు పేజీల లీగల్ నోటీసులను తన న్యాయవాది ద్వారా ఆమె 'ఔట్ లుక్' కు పంపారు. ఆ పత్రిక వివరణ వచ్చిన అనంతరం, పరువునష్టం దావా వేయనున్నట్టు న్యాయవాది తెలిపారు. కాగా, తెలంగాణ ఉద్యమ సమయంలో, ఉద్యమకారులకు ఆమె సహకరించారని, దానిని గుర్తించిన తెలంగాణ ముఖ్యమంత్రి జూనియర్ అధికారిణి అయినప్పటికీ, ఆమెకు కీలకమైన పీఎంవో అడిషనల్ సెక్రటరీ స్థాయి కల్పించారని ఔట్ లుక్ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఈ కథనం వల్ల తన పరువుకు భంగం వాటిల్లిందని పేర్కొంటూ స్మిత సబర్వాల్ నోటీసులు పంపారు.