: రేవంత్ కు కేసీఆర్ క్షమాపణ చెప్పి, కేసును ఉపసంహరించుకోవాలి: ఎర్రబెల్లి


ఓటుకు నోటు కేసులో పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ లభించడంపై టీ.టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. న్యాయం తమవైపు ఉన్నందునే రేవంత్ కు బెయిల్ వచ్చిందన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ కు క్షమాపణ చెప్పాలని, కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వరంగల్ లో మీడియాతో ఎర్రబెల్లి మాట్లాడారు. టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి గెలిపించుకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేసీఆర్ కు ఈ సందర్భంగా ఆయన సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News