: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు ర్యాలీగా వెళ్లనున్న రేవంత్ రెడ్డి


ఓటుకు నోటు కేసులో టీటీడీపీ నేత రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కాసేపట్లో చెర్లపల్లి జైలు నుంచి రేవంత్ రెడ్డి విడుదల కానున్నారు. ఈ క్రమంలో, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు ఆయన భారీ ర్యాలీగా బయల్దేరుతారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన భేటీ అవుతారు. అనంతరం, అక్కడ నుంచి తన నివాసానికి వెళతారు. ఆ తర్వాత, ర్యాలీగా కొడంగల్ బయలుదేరుతారు. మరోవైపు, చర్లపల్లి కారాగారం బయట కోలాహలం నెలకొంది. భారీ సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్న టీడీపీ శ్రేణులు, రేవంత్ కార్యకర్తలు ఆయన విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.

  • Loading...

More Telugu News