: వీహెచ్ పైకి దూసుకెళ్లిన ఆదాం సంతోష్ వర్గీయులు


సికింద్రాబాద్ లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. ఈ క్రమంలో, కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వి.హనుమంతరావుపైకి స్థానిక నేత అయిన ఆదాం సంతోష్ వర్గీయులు దూసుకెళ్లారు. జరిగిన ఘటనతో సమావేశానికి హాజరైన నేతలు, కార్యకర్తలు షాక్ తిన్నారు. ఈ ఘటన తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి సమక్షంలోనే చోటు చేసుకోవడం గమనించదగ్గ అంశం. ఊహించని విధంగా సమావేశం రసాభాసగా మారడంతో నాయకులు సర్దిచెప్పే పనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News