: పాకిస్థాన్ లో భూకంపం


ఉత్తర మరియు వాయవ్య పాకిస్థాన్ లో ఈ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.6గా నమోదయింది. అయితే, ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించలేదని పాకిస్థాన్ రేడియో తెలిపింది. పెషావర్, మల్కండ్, స్వాత్, రావల్పిండి, ఇస్లామాబాద్, అబోటాబాద్ లలో భూకంపం వచ్చిందని వెల్లడించింది. నోబెల్ బహుమతి గ్రహీత మలాలా స్వాత్ లోయకు చెందిన అమ్మాయే. ఈ మధ్య కాలంలో పాకిస్థాన్ లో కూడా తరచుగా భూమి ప్రకంపిస్తోంది.

  • Loading...

More Telugu News