: మహిళలనూ కత్తికి బలిచేసిన ఐఎస్ఐఎస్
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపు మహిళల ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడడంలేదు. ఇప్పటివరకు స్త్రీల జోలికి వెళ్లని ఈ మిలిటెంట్ సంస్థ మరింత కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు అర్థమవుతోంది. తాజాగా, సిరియాలో ఇద్దరు మహిళలను గొంతు కోసి చంపేసింది. తాంత్రిక ప్రయోగం (క్షుద్రపూజలు) ఆరోపణలతో ఐఎస్ వారిని చంపేసిందని మానవ హక్కుల సంస్థ సిరియా విభాగం పేర్కొంది. ఐఎస్ మిలిటెంట్లు డీర్ ఎజ్జోర్ ప్రావిన్స్ లో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలిపింది.