: బెయిల్ పై సుప్రీంలో సవాల్ చేయనున్న ఏసీబీ


ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిలు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ, సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అదనపు న్యాయవాది (ఏజీపీ- అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్) అరుణ్ కుమార్ తెలిపారు. ఈ కేసు వ్యక్తులకు సంబంధించింది కాదని, ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర ఈ కేసులో దాగుందని ఆయన తెలిపారు. రేవంత్ పలుమార్లు 'బాస్' అని వ్యాఖ్యానించారని, ముందు ఆయనెవరో తేలాల్సి వుందని తెలిపారు. బాస్ ఎవరో బయటకు వస్తే ఏ-1గా ఉన్న రేవంత్ ఏ-2గా మారవచ్చని అన్నారు. బెయిలిస్తున్న క్రమంలో ఇది తీవ్రమైన నేరమని చెప్పామని, న్యాయమూర్తి దాన్ని పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయం ఇంకా తేలలేదని అన్నారు. బెయిల్ ఆర్డర్ కాపీని తీసుకున్న తరువాత రెండు రోజుల్లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు అరుణ్ కుమార్ వివరించారు. గతంలో సత్యం కేసులో హైకోర్టు బెయిలు మంజూరుచేస్తే సుప్రీంకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News