: రేవంత్ కు బెయిల్ మంజూరుతో న్యాయమే గెలిచింది: రావుల
ఓటుకు నోటు వ్యవహారంలో టీ.టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని అన్నారు. రేవంత్ కు బెయిల్ లభించడంతో న్యాయమే గెలిచిందని మీడియాతో పేర్కొన్నారు. ఓటుకు నోటు వ్యవహారం రాజకీయ కుట్రతోనే జరిగిందని తాము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నామని రావుల పునరుద్ఘాటించారు.