: రేవంత్ కు బెయిల్ రావడంతో ఉద్వేగానికి లోనైన కుటుంబ సభ్యులు... ఆనందంతో కన్నీటి పర్యంతం


టీటీడీపీ నేత రేవంత్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అప్పటి వరకు ఎంతో ఉత్కంఠతో టీవీకి అతుక్కుపోయిన ఆయన కుటుంబీకులు... బెయిల్ మంజూరయినట్టు వచ్చిన వార్తలను చూడగానే ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్టయినప్పటి నుంచి వారు ఎంతో వేదనను అనుభవించారు. ఉన్నత న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంతో వారిలో ఆనందం కట్టలు తెంచుకుంది. సంతోషంతో వారు కన్నీటి పర్యంతం అయ్యారు. రేవంత్ సతీమణి తన కూతురును హత్తుకుని కంటతడి పెట్టారు. ఆ తర్వాత మిఠాయిలు పంచుకున్నారు. రేవంత్ ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తారా? అని వారు ఎదురు చూస్తున్నారు.

  • Loading...

More Telugu News