: కోర్టుకు హాజరైన హరీష్ రావు
టీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ ఉదయం వరంగల్ కోర్టుకు హాజరయ్యారు. ఆయనపై నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు విచారణ నేడు జరుగుతుండడంతో హరీష్ కోర్టుకు వచ్చారు. పరకాల ఉప ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వచ్చిన సమయంలో కోడ్ నిబంధనలను ఆయన పాటించలేదని కేసు నమోదైన సంగతి తెలిసిందే. కాగా, హరీష్ రావు వెంట టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, స్థానిక రాజకీయ నాయకులు పెద్దఎత్తున రావడంతో కోర్టు ప్రాంగణంలో సందడి నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.