: ఈ రోజు అదనంగా మరో సెకను: నాసా
ఈ రోజు (జూన్ 30) సమయానికి సంబంధించిన నిడివి అధికారికంగా మరో సెకను పాటు పెరగనుందని అమెరికా అంతరిక్ష సంస్ధ (నాసా) తెలిపింది. 'లీప్' సెకన్ జోడింపే ఇందుకు కారణమని వెల్లడించింది. భూమి తనచుట్టూ తాను తిరగడానికి ఒక రోజులో 86400 సెకన్లు పడుతుందని తెలిసిందే. కానీ, వాస్తవ సమయం 86,400.002 సెకన్లు. భూ భ్రమణం వేగం క్రమంగా తగ్గుతున్నందువల్ల ఇలా జరుగుతోంది. దానికి అనుగుణంగా సమయాన్ని సరిచేయడానికే ఈ ఏడాది జూన్ 30న 'లీప్ సెకన్'ను లెక్కిస్తున్నట్టు నాసా పేర్కొంది. మాములుగా గడియారంలో 23:59:59 చేరుకున్నాక 00:00:00 సమయాన్ని సూచిస్తుంది. అయితే ఈ మంగళవారం మాత్రం ప్రామాణిక గడియారం 23:59:59 తరువాత 23:59:60కు వెళుతుంది. ఆ తరువాతే 00:00:00ను సూచిస్తుంది. అయితే దానికి బదులుగా అనేక సమయ వ్యవస్థలను ఒక సెకను పాటు ఆఫ్ చేస్తారు. 1820 ఏళ్ల తరువాత ఇలా జరగడం ఇదే తొలిసారి అని నాసా ప్రతినిధి డానియెల్ మెక్ మిలన్ తెలిపారు.