: లక్ష దాటిన జయలలిత మెజారిటీ... ఘన విజయమే!
పురచ్చితలైవి జయలలిత మెజారిటీ లక్ష ఓట్లను దాటింది. ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ పడ్డ ఆమె 11వ రౌండ్ లెక్కింపు పూర్తయ్యాక సమీప సీపీఐ అభ్యర్థి సి. మహేంద్రన్ కంటే లక్ష ఓట్లకు పైగా మెజారిటీని సాధించారు. మహేంద్రన్ కు దాదాపు 7 వేల ఓట్లు రాగా, జయలలితకు 1.10 లక్షల ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. 16 పోస్టల్ ఓట్లు రాగా అన్నీ జయకే వచ్చాయని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ నోటా (ఏ అభ్యర్థీ నచ్చలేదని ఓటర్లు వేసే ఓట్లు) ఓట్లు 1000 దాటినట్టు తెలుస్తోంది. కాగా, పోయిస్ గార్డెన్ ఏఐఏ డీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలు, జయలలిత అభిమానులతో నిండిపోయింది. మరో 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగాల్సి వుండగా, జయలలిత రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధిస్తారని ఆమె మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు.