: ఈ సాయంత్రమే జైలు నుంచి రేవంత్ విడుదలయ్యే అవకాశం... టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం


ఓటుకు నోటు కేసులో రిమాండ్ లో ఉన్న టీటీడీపీ నేత రేవంత్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో... టీడీపీ శ్రేణులు, రేవంత్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. తమ నేతకు హైకోర్టు న్యాయం చేసిందని వారు చెబుతున్నారు. మరోవైపు, హైకోర్టు బెయిల్ ఆర్డర్ కాపీలు ఈ మధ్యాహ్నం 12 లేదా 12.30 గంటలకల్లా వస్తాయని భావిస్తున్నారు. ఆర్డర్ కాపీలు వచ్చిన వెంటనే, ఆ కాపీలను తీసుకుని ఏసీబీకి అప్పగిస్తామని... ఆ తర్వాత రేవంత్ జైలు నుంచి విడుదల కావడానికి అవసరమైన చర్యలను తీసుకుంటామని రేవంత్ తరపు న్యాయవాదులు చెప్పారు. ఈ సాయంత్రానికే రేవంత్ రెడ్డి జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని న్యాయవాది సుధీర్ తెలిపారు.

  • Loading...

More Telugu News