: వాహనచోదకులు ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించాలి: కమలహాసన్
వాహనచోదకులు హెల్మెట్ ను ధరించాలన్న నిబంధనను ఈ రోజు నుంచి తమిళనాడు ప్రభుత్వం తప్పనిసరి చేయడంపై తమిళ సినీ నటుడు, దర్శకుడు కమలహాసన్ మద్దతు పలికాడు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, సురక్షితంగా డ్రైవింగ్ చేయాలని కమల్ కోరాడు. "ద్విచక్ర వాహనాన్ని నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలి. ఇది మీ స్వీయ రక్షణకు సహకరిస్తుంది. సినిమాల్లో నటీనటులు హెల్మెట్స్ ధరించరన్న ఆరోపణలు వస్తుంటాయి. అయితే సినిమాలో లేదా సర్కస్ లో ప్రదర్శించే స్టంట్స్ ను ఇంట్లో చేయలేం కదా?" అని కమల్ ఓ వీడియో ద్వారా పేర్కొన్నాడు.