: టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న డి.శ్రీనివాస్?


తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నారా? టీఆర్ఎస్ లో చేరనున్నారా? ఇదే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. టీఆర్ఎస్ లో చేరడానికి ఇప్పటికే ఆయన మానసికంగా సిద్ధమవుతున్నారని ఓ పత్రికలో కథనం రావడం ఉత్కంఠను రేపుతోంది. ఇంతకాలం కాంగ్రెస్ కు వెన్నెముకలా నిలిచిన డీఎస్ పార్టీ మారితే... తెలంగాణలో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టవుతుందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మొన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు డీఎస్ ను కలవడానికి ప్రయత్నించారు. కానీ, డిగ్గీరాజాతో మాట్లాడటానికి కూడా డీఎస్ సుముఖత చూపలేదు. తనకు ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుకుంది డిగ్గీనే అని డీఎస్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, సొంత పార్టీలో అవమానాలు పడేకంటే, పార్టీ ఫిరాయించడమే మేలనే యోచనలో డీఎస్ ఉన్నట్టు సమాచారం. మరోవైపు, డీఎస్ రాకను టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News