: హెల్మెట్ తప్పనిసరి నిబంధన ఆగస్టుకు వాయిదాపడింది


హైదరాబాద్ లో వాహనదారులకు హెల్మెట్ వాడకం నిబంధన ఆగస్టుకు వాయిదాపడింది. వాస్తవానికి జులై 1 నుంచి దీనిని అమలు చేయాలని పోలీసు విభాగం నిర్ణయించింది. వివిధ కారణాల నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని మరో నెలపాటు వాయిదా వేసింది. అంటే ఆగస్టు 1 నుంచి హెల్మెట్ వాడకం తప్పనిసరికానుంది. ఈ క్రమంలో జులై నెల రోజుల పాటూ వాహనచోదకులకు హెల్మెట్ వినియోగంపై పూర్తి కౌన్సెలింగ్ ఇవ్వాలనుకుంటున్నారు. తరువాత నెల 1 నుంచి జరిమానా విధింపు ప్రక్రియను ప్రారంభించాలని యోచిస్తున్నారు.

  • Loading...

More Telugu News