: 8 ఎంపీ, 180 డిగ్రీల రొటేటింగ్ కెమెరా స్మార్ట్ ఫోన్ రూ. 5,999
మరో ఆసక్తికరమైన ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానుంది. 8 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న 180 డిగ్రీల రొటేటింగ్ కెమెరా, ఫ్లాష్, 8 జిబి ఇన్ బిల్ట్ మెమొరీ, 5 అంగుళాల స్క్రీన్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్, 1.3 జిహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. యాండీ ఎవాంటీ-5 పేరిట ఐబాల్ దీన్ని తయారు చేసింది. మరో రెండు వారాల్లో భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చే ఫోన్ ఖరీదు రూ. 5,999 అని సంస్థ వివరించింది. 3జి, వైఫై, జీపీఎస్, మైక్రో-యూఎస్ బీ తదితర సదుపాయాలు కూడా ఉన్నాయని సంస్థ డైరెక్టర్ సందీప్ పరశురాంపూరియా తెలిపారు. ఇది రూ. 6 వేల కన్నా తక్కువ ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్ కాగలదని ఆయన అన్నారు.