: రెండు రోజుల్లో పవన్ కల్యాణ్ ఇంటిముందు నిరసన: వీహెచ్
రెండు మూడు రోజుల్లో పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి ఆయన్ను కొన్ని ప్రశ్నలడుగుతానని, తగిన సమాధానం ఆయనివ్వకుంటే, ఇంటిముందే బైఠాయించి నిరసన తెలియజేస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు వ్యాఖ్యానించారు. 'అవినీతిని రూపుమాపుతా, తప్పు చేస్తే నిలదీస్తా' అంటూ గత ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రగల్భాలు పలికాడని, ఇప్పుడు స్పందించడం లేదని వీహెచ్ ఆరోపించారు. ఎన్నికల ముందు 'జనసేన' పేరిట పార్టీని పెట్టి ఆపై కనిపించకుండా పోయాడని, చంద్రబాబు బండారం రేవంత్ రెడ్డి రూపంలో బయటపడ్డప్పటికీ, ఒక్క ప్రశ్న కూడా ఆయన వేయలేదని ఆరోపించారు.