: పావుగంటలో టూ వీలర్, అరగంటలో కారు లోన్: హెచ్‌డీఎఫ్‌సీ


ఇండియాలో రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుగా గుర్తింపున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రెండు ప్రత్యేక స్కీములను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. పావు గంటలో ద్విచక్ర వాహన రుణం, అరగంటలో కారు కొనుగోలుకు రుణం మంజూరు చేస్తామని తెలిపింది. ఈ రుణాల కోసం బయో మెట్రిక్ పద్ధతిలో పూర్తి సమాచారాన్ని రుణ గ్రహీతలు అందించాల్సి వుంటుందని వివరించింది. ఈ సదుపాయాన్ని బ్యాంకు ఖాతాదారులతో పాటు ఇతరులకు కూడా అందిస్తామని, లోన్ కోరుకునేవారు వాహన డీలర్ షిప్ వివరాలను ఆధార్ కార్డు నెంబర్, ఫింగర్ ప్రింట్స్ సహా బ్యాంకు శాఖల్లో ఏర్పాటు చేసిన టచ్ పాయింట్లలో ఇవ్వాలని తెలిపింది. ఈ సమాచారంతో పాటు అవసరమైన ఇతర డాక్యుమెంట్లను తీసుకుని వెంటనే రుణాన్ని మంజూరు చేస్తామని బ్యాంకు ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, బ్యాంకు ఇప్పటికే పది సెకన్లలో వ్యక్తిగత రుణ మంజూరు పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News