: వాళ్లు ఫిక్సింగ్ కు పాల్పడినట్టు ఆధారాల్లేవు: ఐసీసీ
ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ ఆరోపణలపై దృష్టి సారించిన ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీఎస్ యూ) రైనా, బ్రావో, జడేజాలకు ఊరటనిచ్చింది. ఐపీఎల్ లో వారు ఫిక్సింగ్ కు పాల్పడినట్టు ఆధారాల్లేవని తెలిపింది. అందుబాటులో ఉన్న సమాచారం పరిశీలించిన మీదట ఈ నిర్ణయానికి వచ్చామని ఏసీఎస్ యూ పేర్కొంది. దీనిపై భారత క్రికెట్ వర్గాలు స్పందించాయి. ఏసీఎస్ యూ ఏవైనా ఆధారాలు సంపాదించి ఉంటే వెంటనే వారిపై చర్యలకు ఉపక్రమించి ఉండేదని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. గత రెండేళ్లుగా క్రికెట్లో ఎక్కడా అవినీతి చోటు చేసుకోలేదని, సదరు క్రికెటర్లు ఏవైనా తప్పిదాలకు పాల్పడి ఉంటే, ఏసీఎస్ యూ వెంటనే విచారణ ప్రారంభించేందని, అవినీతికి పాల్పడ్డారన్న దానికి ఆధారాల్లేవు కనుకనే ఏసీఎస్ యూ ఈ విషయానికి ఇంతటితో తెరదించిందని పేర్కొన్నాయి.