: భారత్ వీసా కోసం పాక్ క్రికెటర్ ఎదురు చూపులు


భారత్ వీసా కోసం పాక్ క్రికెటర్ ఎదురు చూస్తున్నాడు. చకింగ్ కు పాల్పడుతున్నాడన్న ఆరోపణలతో కొంత కాలం నిషేధానికి గురైన పాక్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ పరీక్షలకు వెళ్లి పాసై పునఃప్రవేశం చేశాడు. అనంతరం శ్రీలంక పర్యటనకు ఎంచుకున్న జట్టులో హఫీజ్ చోటు సంపాదించుకున్నాడు. తొలి టెస్టు ఆడుతుండగా అతనిపై మరోసారి చకింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో అతని బౌలింగ్ యాక్షన్ ను చూపే బయో మెకానిక్స్ లేబరేటరీ రిపోర్టు ఐసీసీకి సమర్పించాల్సి ఉంది. బయో మెకానిక్స్ టెస్టు చేసేందుకు తగ్గ సౌకర్యాలు చెన్నైలోని ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్ లో ఉన్నాయి. దీంతో బౌలింగ్ యాక్షన్ రిపోర్టు ఐసీసీకి పంపాలంటే చెన్నై రావాలి. ఈ నేపథ్యంలో హఫీజ్ భారత ఎంబసీకి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే భారత అధికారుల నుంచి ఇంకా అనుమతులు రాకపోవడంతో వీసా కోసం నిరీక్షిస్తున్నాడు. జూలై 3 నుంచి శ్రీలంకతో మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఆ లోపు వీసా రాని పక్షంలో ఐసీసీని మరో 14 రోజుల అదనపు గడువు కోరాలని పీసీబీ భావిస్తోంది.

  • Loading...

More Telugu News