: ఉబ్బితబ్బిబ్బవుతున్న హర్భజన్ సింగ్


స్టార్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆనందం అంబరాన్నంటుతోంది. దాదాపు నాలుగేళ్ల అనంతరం వన్డే జట్టులో చోటు దక్కడమే భజ్జీ సంతోషానికి కారణం. జింబాబ్వే టూర్ కు టీమిండియాలో స్థానం సంపాదించిన ఈ పంజాబ్ యోధుడు తన ఎంపికపై మాట్లాడుతూ... "బ్లూ జెర్సీ మళ్లీ ధరించనుండడంపై ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. క్రికెట్ ఆడడం తప్ప మరే విషయాన్ని పట్టించుకోలేదు. కెరీర్ మొదటి నుంచి నాది ఇదే పంథా. ఇప్పుడూ అంతే. టీమిండియా కోసం సర్వశక్తులు ఒడ్డేందుకు ప్రయత్నిస్తా. క్రికెట్ కూడా చదువులాంటిదే. 10 నెలల తర్వాత వచ్చే వార్షిక పరీక్షల కోసం ఓ విద్యార్థి రాత్రింబవళ్లు చదువుతాడు. కానీ, క్రికెటర్ పరిస్థితి అలా కాదు. ప్రతి మూడవనాడు అతడికి పరీక్షే. ప్రతి దానికి సర్వసన్నద్ధత కనబర్చాల్సిందే. ఇప్పుడు జింబాబ్వేతో సిరీస్ ను కూడా అలాగే భావించి కష్టపడుతున్నా" అని వివరించాడు.

  • Loading...

More Telugu News