: చైనా గోడకు దొంగల బెడద!


ప్రసిద్ధ కట్టడం, ప్రపంచ వింతల్లో ఒకటైన చైనా గోడకు దొంగల బెడద పట్టుకుంది. యునెస్కో వెల్లడించిన వివరాల ప్రకారం 30 శాతం చైనా గోడ మాయమైందట. ప్రకృతి వైపరీత్యాలు, స్థానికుల చర్యలు, ఇటుకలు దొంగిలించడం వంటి కారణాల వల్ల చైనా గోడకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని యునెస్కో ఆందోళన వ్యక్తం చేసింది. చైనా గోడలో కొన్ని చోట్ల ఇటుకలను ఉపయోగించడం వల్ల ప్రపంచ ప్రసిద్ధ కట్టడం ధ్వంసమవుతోందని యునెస్కో పేర్కొంది. ఆకాశం నుంచి చూస్తే ప్రస్తుతం ఉన్న చైనా గోడ పొడవు తగ్గినట్టు కనిపిస్తోందని యునెస్కో వెల్లడించింది. ప్రస్తుతం చైనా గోడ పొడవు 9 వేల కిలో మీటర్ల నుంచి 21 వేల కిలో మీటర్ల మధ్య ఉందని యునెస్కో తెలిపింది.

  • Loading...

More Telugu News