: ప్రస్తుతం సినిమాల్లో నటించాలనే ఆసక్తి లేదు: మీనాక్షీ శేషాద్రి
సినిమాల్లో నటించాలనే ఆసక్తి లేదని ప్రముఖ నటి మీనాక్షీ శేషాద్రి స్పష్టం చేసింది. 'ఆపద్బాంధవుడు' సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించిన మీనాక్షి శేషాద్రి సుదీర్ఘ కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ఉత్తర, దక్షిణాది భాషలతో సంబంధం లేకుండా మీనాక్షి శేషాద్రి అలరించింది. 1990లో సూపర్ హిట్టైన 'ఘాయల్' సినిమా సీక్వెల్ తో మీనాక్షీ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనుందనే వార్తలు బాలీవుడ్ లో హల్ చల్ చేశాయి. వాటిపై స్పందించిన ఆమె తనకు కుటుంబం, పిల్లలు ముఖ్యమని చెప్పింది. వారి తరువాతే సినిమాలైనా, ఇంకేవైనా అని తెలిపింది. ఇప్పుడు సినిమాలపై ఆసక్తి లేదని, తన పిల్లలు గ్రాడ్యుయేషన్ కోర్సుకి వచ్చేటప్పటికి సినిమాలు చేస్తానేమో తెలియదని ఆమె పేర్కొంది. అయితే, స్టేజీ, నృత్య ప్రదర్శనలు చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె చెప్పింది.