: అది 'ఇస్లామిక్ స్టేట్' ఎలా అవుతుంది?... దాన్నలా పిలవొద్దు: బ్రిటన్ ప్రధాని కామెరాన్


బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ఐఎస్ మిలిటెంట్ గ్రూపు కిరాతకాలపై తీవ్రంగా స్పందించారు. ఆ మిలిటెంట్ గ్రూపును 'ఇస్లామిక్ స్టేట్' అని పిలవరాదని మీడియాకు సూచించారు. బీబీసీ కార్యక్రమంలో కామెరాన్ మాట్లాడుతూ... ఆ గ్రూపు సాగిస్తున్న మారణకాండ దృష్ట్యా ఆ పేరుతో సంబోధించరాదని పిలుపునిచ్చారు. వారి చర్యలు నిజమైన 'ఇస్లామిక్ స్టేట్' ను ప్రతిబింబించడంలేదని స్పష్టం చేశారు. ఆ గ్రూపును 'ఇస్లామిక్ స్టేట్' అని పిలిస్తే, అనవసరంగా పవిత్రత ఆపాదించినట్టవుతుందని అభిప్రాయపడ్డారు. " అసలేమిటది? భయంకరమైన, అటవిక పాలన సాగిస్తోంది. ఇస్లాం మతానికి వక్రభాష్యం చెప్పి దారుణాలకు పాల్పడుతున్నారు" అని మండిపడ్డారు. ట్యునీషియాలో ఓ బీచ్ రిసార్ట్ పై ఐఎస్ సాయుధ ఉగ్రవాది దాడి చేసిన ఘటనలో పెద్ద సంఖ్యలో టూరిస్టులు మృతి చెందడంపై కామెరాన్ ఆవేదన వ్యక్తం చేశారు. 'ట్యునీషియా' మృతుల్లో అత్యధికులు బ్రిటీష్ జాతీయులే.

  • Loading...

More Telugu News