: ఏపీ భవన్ కు చేరుకున్న తెలుగు యాత్రికులు
బద్రీనాథ్ యాత్రకు వెళ్లి వరదల కారణంగా అక్కడే చిక్కుపోయిన 16 మంది తెలుగు యాత్రికులు ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీలోని ఏపీ భవన్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి వారిని స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్ లోని గోవిందం ధామ్ లో చిక్కుకున్న 3,500 యాత్రికులను ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టి సురక్షితంగా రక్షించాయి.