: బడిలో 'బొమ్మాళి'... పోలీసుల రాకతో పరార్!


వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలోని కస్తూర్బా పాఠశాలలో మాస్ హిస్టీరియాతో విద్యార్థులు ఊగిపోయిన ఘటన చోటుచేసుకుంది. కస్తూర్బా పాఠశాలలో గత కొంత కాలంగా దెయ్యం తిరుగుతోందంటూ పుకార్లు రేగాయి. దీంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారు. ఈ నేపధ్యంలో పుకార్లను బలపరుస్తూ సిబ్బందిలోని శారద అనే మహిళ హిస్టీరియాతో ఊగిపోయింది. గత కొంత కాలంగా ఇలాంటి వింత ప్రవర్తన చూపుతున్నప్పటికీ ఈ మధ్య కాలంలో హిస్టీరియా విద్యార్థులకు కూడా పాకింది. శారద హిస్టీరియాతో వింతగా ప్రవర్తిస్తుండగా, తరగతి గదిలోని విద్యార్థినులకు కూడా మాస్ హిస్టీరియా పాకింది. విద్యార్థినులు అందరూ దెయ్యం పట్టిందంటూ హిస్టీరియాతో ఊగిపోవడం ప్రారంభించారు. దీంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పాఠశాలకు చేరుకోవడంతో విద్యార్థులు మామూలుగా మారిపోయారు. దీంతో పాఠశాలలో సైకియాట్రిస్ట్ లేదా సైకాలజిస్టును నియమించాలని పలువురు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News