: మిలియన్ కు చేరిన ఎయిర్ కోస్టా ప్రయాణికులు


ఎయిర్ కోస్టా ప్రయాణికుల సంఖ్య మిలియన్ (పదిలక్షలు)కు చేరుకుంది. 2013 అక్టోబర్ నుంచి సేవలు ప్రారంభించిన ఎయిర్ కోస్టా అనతికాలంలోనే వినియోగదారుల ఆదరణ అందుకుంది. నేడు బెంగళూరు నుంచి హైదరాబాదుకు నడిపిన సర్వీసులో ప్రయాణించిన వారితో కలిపి, గడచిన 20 నెలల్లో పది లక్షల మంది ప్రయాణించారని ఎయిర్ కోస్టా తెలిపింది. సరసమైన ధరలకే విమాన ప్రయాణాన్ని అందిస్తున్న ఎయిర్ కోస్టా, తమ సేవలు అందుకున్న ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపింది. ప్రయాణికుల సంఖ్య పది లక్షలకు చేరడంతో హర్షం వ్యక్తం చేసిన ఎయిర్ కోస్టా, ప్రయాణికులకు ఉచితంగా స్నాక్స్ పంచిపెట్టింది.

  • Loading...

More Telugu News