: ఇకపై ఇల్లు కట్టడానికి రెండు రోజులు చాలు


ఇల్లు కట్టాలంటే బోలెడు ఖర్చు, చాలా మంది కార్మికులు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకు నెలలు, ఏళ్లు పడుతుందని చాలా మంది చెబుతుంటారు. వారి మాటల్ని తల్లికిందులు చేస్తూ, కేవలం రెండు రోజుల్లోనే ఇల్లు నిర్మించే రోబోను ఆస్ట్రేలియన్ ఇంజనీర్ రూపొందించారు. ఈ రోబో కేవలం రెండు రోజుల్లోనే ఇంటి నిర్మాణం పూర్తి చేస్తుందని ఆయన భరోసా ఇస్తున్నారు. హార్డియన్ అనే ఇంజనీర్ రూపొందించిన రోబో, రెండు రోజుల్లో ఓ నిర్మాణం పూర్తి చేయగలదని, ఏడాదికి 150 ఇళ్లు నిర్మించగలదని చెబుతున్నారు. ఇంటినిర్మాణం గురించిన 3డీ ప్రోగ్రామ్ ని కంప్యూటర్ లో రూపొందించి, దాని ద్వారా ఈ రోబోకు కమాండ్స్ ఇస్తే, 28 అడుగుల పొడవుగల చేతులతో ఇంటి నిర్మాణం పూర్తి చేస్తుందని రూపకర్త చెబుతున్నారు.

  • Loading...

More Telugu News