: రేప్ చేశాడా?...వాడితోనే పెళ్లి చేసేద్దాం!: పంచాయతీ నిర్ణయం


అరాచకాల ఉత్తరప్రదేశ్ లో దారుణమైన సంస్కృతికి పంచాయతీల పెద్దలు ప్రాణం పోస్తున్నారు. అత్యాచారానికి గురైన యువతికి బలవంతంగా అత్యాచారం చేసిన వ్యక్తితో వివాహం చేయాలని నిర్ణయించారు. వివరాల్లోకి వెళితే... యూపీలోని మనోనా గ్రామానికి చెందిన గౌరవ్ యాదవ్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ యువతిపై ఈ నెల 21న అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన అవమానం తట్టుకోలేని యువతి అదే రాత్రి ఆత్మహత్యాయత్నం చేసింది. యువతిని రక్షించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నారు. దారుణానికి పాల్పడిన గౌరవ్ యాదవ్ పరారీలో ఉండగా, అతడిని కేసు నుంచి తప్పించేందుకు పంచాయతీ పెద్దలు రంగంలోకి దిగారు. అత్యాచారానికి పాల్పడిన గౌరవ్ యాదవ్ తో బాధితురాలికి వివాహం జరిపించాలని తల్లిదండ్రులను ఆదేశించారు. గ్రామ పెద్దల నిర్ణయానికి ఎదురు తిరిగితే వెలివేస్తారన్న భయంతో బాధితురాలి తల్లిదండ్రులు ఈ వివాహానికి అంగీకరించగా, యువతి వ్యతిరేకిస్తోంది. కాగా, దీనిపై ఎలాంటి సమాచారం అందలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News