: న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది: శ్రీశాంత్


టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడాడు. ఐపీఎల్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ సోమవారం కోర్టుకు హాజరయ్యాడు. ఈ కేసు విచారణను న్యాయస్థానం జులై 25కి వాయిదా వేసింది. శ్రీశాంత్ మాట్లాడుతూ... భారత న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందన్నాడు. గత రెండేళ్లుగా ఈ కేసు విచారణకు హాజరవుతున్నానని, తీర్పు కోసం మరో నెల ఎదురుచూడలేనా? అని పేర్కొన్నాడు. అంతకుముందు శ్రీశాంత్ తల్లి కూడా కొచ్చిలో మీడియాతో మాట్లాడుతూ ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. ఇక, తన సోదరుడు ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని, నిర్దోషిగా బయటపడతాడని శ్రీశాంత్ సోదరి పేర్కొంది.

  • Loading...

More Telugu News