: 'చాద్'లో మరోసారి బాంబు పేలుళ్లు
అనుభవాల నుంచి పాఠాలు నేర్వకపోతే చాద్ లాంటి ఘటనలే పునరావృతమవుతాయి. రిపబ్లిక్ ఆఫ్ చాద్ రాజధాని జమేనాలో గత వారం రెండు ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు క్షతగాత్రులుగా మిగిలారు. అనంతరం కూడా అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో, అదే ప్రాంతంలో నేడు రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో ఐదుగురు పోలీసులు సహా 11 మంది మృత్యువాత పడ్డారు. దీంతో స్పందించిన చాద్ భద్రతా యంత్రాంగం, 60 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.